రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్ గ్రామానికి చెందిన దంపతులు కందుల తిరుపతి–స్రవంతి గత జనవరిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి కూతురు శివాణి ఒంటరిగా మారడం, ఆమె దీనగాథపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడం దాతలను స్పందింపజేస్తోంది. గ్రామస్తులు ‘చిన్నారి తల్లి’ పేరిట వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. అందులో వెయ్యి మంది సభ్యులుగా చేరారు. అంతేకాదు.. బాలికకు బాసటగా నిలిచేందుకు ఇప్పటివరకు రూ.8.52 లక్షలు సాయం చేశారు. ఈ మొత్తాన్ని సోమవారం బంధువులు శివాణి పేరిట స్థానిక పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ వివరాలను కూడా ‘చిన్నారి తల్లి’ వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశారు.
కందుల శివాని పేరిట చేసిన డిపాజిట్
‘సాక్షి’ వరుస కథనాలతో స్పందిస్తున్న దాతలు
ఒంటరైన బాలిక పేరిట మీద రూ.8.52 లక్షల డిపాజిట్


