ఆన్‌లైన్‌ గేమ్స్‌.. యూత్‌ ఆగం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్స్‌.. యూత్‌ ఆగం

Mar 9 2026 7:16 AM | Updated on Mar 9 2026 7:16 AM

● క్యాసినో గేమ్స్‌కు బానిసైన పల్లెజనం ● ఇల్లంతకుంట మండలంలో విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ● నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారని వైనం ● లక్షల్లో నష్టపోతున్న పలు కుటుంబాలు

హఠాత్తుగా దివాళా

● క్యాసినో గేమ్స్‌కు బానిసైన పల్లెజనం ● ఇల్లంతకుంట మండలంలో విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ● నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారని వైనం ● లక్షల్లో నష్టపోతున్న పలు కుటుంబాలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఈజీగా మనీ వస్తుందనే ఆశతో పలువురు పల్లె ప్రజలు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారారు. ఒక్క రోజుల్లో లక్షాధికారి కావాలన్న దురాశతో క్యాసినో వంటి ఆన్‌లైన్‌గేమ్స్‌లలో డబ్బులు పెడుతూ నిండా మునుగుతున్నారు. ఈ వ్యవహారం జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఎక్కువగా జరుగుతుంది. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ బెట్టింగ్‌ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గోవాలోని నిర్వాహకులతో అనుబంధం

ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు గోవాలోని పలు క్యాసినో సెంటర్‌లలో ఐడీలు కలిగి ఉన్నారు. వీరు పల్లె యువతతో పరిచయం పెంచుకొని తక్కువ పెట్టుబడితో ఒక్క రోజులోనే లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపుతూ క్యాసినో గేమ్స్‌లో డబ్బులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. గేమ్స్‌లో డబ్బులు పెట్టేందుకు ఆసక్తి చూపిని వారికి ఐడీలు ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్‌ లింక్స్‌ పంపిస్తూ కొంత డబ్బు కమీషన్‌ పొందుతున్నారు. ఇలాంటి వారు మండల వ్యాప్తంగా పది మంది వరకు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారం గత నాలుగేళ్లుగా గుట్టుగా సాగుతున్నా ఇటీవల వెలుగుచూసింది. గత రెండేళ్లుగా ఈ గేమ్స్‌కు బానిసైన వారి సంఖ్య మండల వ్యాప్తంగా 2 వేల నుంచి 3వేల వరకు ఉంటారని సమాచారం. ఇలా ప్రతీ ఊరిలో దాదాపు వంద మందికి పైగానే ఉండడంతో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఒకరి ద్వారా మరొకరికి తెలియడంతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్న వ్యవహారం బయటకు పొక్కింది.

జవారిపేటలో అవగాహన సదస్సు

మండలంలోని జవారిపేటలో ఆరు నెలల క్రితం అప్పటి సిరిసిల్ల రూరల్‌ సీఐ మొగిలి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు గ్రామానికి వచ్చి అవగాహన కార్యక్రమం పెట్టారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నారనే సమాచారంతో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. యువకుల చేతుల్లోని ఫోన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌తో జరిగే అనర్థాల గురించి వివరించారు.

ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వింతపోకడలు కనిపిస్తున్నాయి. పలు పల్లెల్లో చాలా మంది యువత హఠాత్తుగా కుంగిపోయి కనిపిస్తున్నారు. ఎందుకా.. అని ఆరా తీస్తే ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్టి నష్టపోతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారు మండలంలో ప్రతీ గ్రామంలో ఇద్దరు.. ముగ్గురు కనిపిస్తారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్టి నష్టపోయామన్న విషయం బయటకు చెప్పకపోవడంతో మరింత మంది ఆకర్షితులై ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. మరికొంతరు రాత్రికి రాత్రే కొత్త కొత్త కార్లు కొనుగోలు చేస్తూ తమ దర్పం కనిపించేలా తిరుగుతున్నారు. వీరు కూడా అలాంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్టి లాభాలు వచ్చి ఇలా కార్లు కొంటున్నారు. ఇలాంటి వారు మండలంలో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఇలా ఒకరిద్దరిని చూసి వేలాది మంది యువత క్యాసినో వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్టి నిండా మునుగుతున్నారు.

ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి డబ్బులు గెలుపొందిన వారి ఖాతాల్లో చేరిన నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతున్నట్లు తెలిసింది. ఇలా వారి ఖాతాల నుంచి తీసుకోలేకుండా నిలిచిపోయిన డబ్బు కూడా లక్షల్లో ఉన్నట్లు సమాచారం. నిత్యం మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ట్రాంజాక్షన్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement