తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమాండల్ కంపెనీ, తెలంగాణ వ్యవసాయశాఖ సంయుక్తంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వర్సిటీ ఆవరణలో ఆదివారం మెగా రైతుమేళా ప్రారంభమైంది. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం (కేవీకే), బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల ప్రతినిధుల ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.సాయికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాధవి, సంపత్‌కుమార్ పలు అంశాలపై అవగాహన కల్పించారు.


