రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కలెక్టర్ గరీమా అగ్రవాల్
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందిస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్
వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: ప్రజా ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ ఏరియా ఆస్పత్రిలో హెచ్‌పీవీ వాక్సినేషన్‌ను ఆదివారం ప్రారంభించారు. పాది శ్రీనివాస్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, మహిళల సాధికారత వంటి పలు కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు సుమారు రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. 14 ఏళ్ల బాలికలకు ముందస్తుగా హెచ్‌పీవీ టీకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో టీకాలు వేస్తారని, జిల్లా పరిధిలో 3773 మందిని గుర్తించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్‌లు కనికరపు రాకేశ్, నరాల శేఖర్, డీఎంహెచ్‌వో రజిత, డాక్టర్ దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలోని 14 నుంచి 15 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలకు హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రజలకు కోరారు. జిల్లా ఆస్పత్రిలో ఆదివారం టీకా పంపిణీని ప్రారంభించారు. 2011 ఏప్రిల్ 1, 2012 మార్చి 31 మధ్య జన్మించిన బాలికలకు టీకాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు తల్లిదండ్రులు బాధ్యతతో వ్యాక్సిన్ వేయించాలని కోరారు. జిల్లాలోని 3,773 మంది బాలికలను గుర్తించారని, తల్లిదండ్రులు గుర్తింపుకార్డుతో వచ్చి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలైందని వెల్లడించారు.
ఘనంగా మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీఎంహెచ్‌వో రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.


