ఇల్లంతకుంట(మానకొండూర్): మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని రేపాక, తాళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. మగపిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. సర్పంచ్ ఖాతా మల్లేశం, ఉప సర్పంచ్ కోదని మహేశ్, మాజీ ఎంపీపీ రమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, తాళ్లపల్లి సర్పంచ్ మీసాల కనకరాజు, ఎంపీడీవో శశికళ, ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవం
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి అనురాధ, ఎంపీడీవో శశికళ, రేపాక మహిళా సంఘాల సభ్యులను మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాలతో సన్మానించారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ముస్తాబాద్‌లో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ రెండో రోజు శిబిరం ఆదివారం జరిగింది. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, బీజేపీ ఉపాధ్యక్షులు శీలం రాజు, సంతోష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచులు నక్కదాసరి రవి, మెంగని శ్రీనివాస్, దగ్గు నవీన్, మెంగని మహేందర్, గోపి, మహేశ్వరి, సత్యంరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, చిగురు వెంకన్న, మహేశ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, రూ.20వేలు పెన్షన్, సంక్షేమ బోర్డు, గుర్తింపుకార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, కర్నె లక్ష్మి, చిలుక శారద, గోదావరి, మల్లేశ్వరీ, బల్ల చంద్రకళ, కొలిపాక విజయ, ఏనుగుల స్వప్న, గాజుల ఉమ పాల్గొన్నారు.
కరాటేలో ప్రతిభ
సిరిసిల్లటౌన్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన స్పార్క్ కుంగ్‌ఫూ కరాటే విద్యార్థులు 20 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు. ధర్మపురిలో జరిగిన పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మాస్టర్ వొడ్నాల శ్రీనివాస్, గ్రాండ్ మాస్టర్ ఎం.ఎ. హమీద్, మాస్టర్ సయ్యద్ యాకుబ్, మాస్టర్ కోటేశ్వర్ అభినందించారు.


