విలీనంలో దాహం కేకలు | - | Sakshi
Sakshi News home page

విలీనంలో దాహం కేకలు

Mar 9 2026 7:16 AM | Updated on Mar 9 2026 7:16 AM

సిరిసిల్ల అర్బన్‌: విలీన గ్రామాల్లో తాగునీటి కోసం స్థానికులు పడుతున్న కష్టాలు అనేకం. రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పెద్దూరులో పారిశుధ్యం పనులపై పట్టింపు కరువవడంతో పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. మిషన్‌ భగీరథ పైపులు పగిలిపోయి నీరు వృథాగా పోతుంది. పట్టించుకునే వారు లేక విలీన గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అన్నీ సమస్యలే..

సిరిసిల్ల మున్సిపాలిటీ శివారులోని పెద్దూరులో ఓ వైపు నీరు సరఫరా అవుతున్నా ఇప్పలపల్లికి వెళ్లే దారిలోని పోచమ్మ ఆలయం నుంచి పైకి తాగునీరు లేక ఆ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పలపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే మురుగునీరు నిలిచి దుర్వాస వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం డ్రెయినేజీల్లో చేరి కంపు కొడుతున్నాయి.

తాగునీటికి కటకట

గ్రామంలోని పలు కాలనీల్లో తాగునీటికి స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజు విడిచి రోజు నీ టిని సరఫరా చేస్తున్నా నల్లాల ద్వారా పది బిందెలకు మించి రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పైపులైన్‌ పగిలి పోయి మురుగునీరు అందులోకి చేరి తాగునీరు కలుషితం అవుతోందని స్థానికులు చెబుతున్నారు.

ఓ వైపు వృథా.. మరోవైపు తిప్పలు

విలీన గ్రామాల్లో లీకేజీలతో అపరిశుభ్రం

ప్రజాసమస్యలపై పట్టింపు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement