నేను పెద్దూరులోని ముత్యాల పోచమ్మ ఆలయంలో పూజారి గా పనిచేస్తున్నాను. గుడి లోప ల, పరిసరాలు శుభ్రం చేయడానికి నీటి సౌకర్యం లేదు. అందుకోసం నేను గత పది హేను రోజులుగా పొలం నుంచి బిందెతో తీసుకొచ్చి పూజ చేస్తున్నాను. నీటి వసతి కల్పించాలి.
– తిప్పవరం విజయ, పెద్దూరు
మాది పెద్దూరు. ఎండాకాలం రాకముందే నీటి కోసం ఇబ్బ ంది పడుతున్నాము. ఇప్పటికీ ఇరువై రోజులు గడుస్తోంది. పొలం వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాము. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాలి.
– జవ్వాజి నర్సవ్వ, పెద్దూరు


