ఊరూరా ఉప్పు అమ్మి..
ఉజ్వల భవితనిచ్చి
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
మామిడి కొనాల మీన..
● ధైర్యంగా ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం ● పోలీసుశాఖలోకి యువతులు రావాలి
● కుటుంబం అండతో ఉద్యోగంలో రాణిస్తున్నా
● ‘సాక్షి’తో ఏసీపీ వాసంశెట్టి మాధవి
● జానపదాలతో ట్రెండింగ్‌లో నాగవ్వ
సాక్షి, కరీంనగర్ డెస్క్: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కై కట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్ అ య్యింది. మంగ్లీతో జతకట్టి ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్ ఫేమస్ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం
గుల్లకోటకు చెందిన నాగవ్వ.
యక్షగానంతో ప్రారంభమై..
తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. వ్యూస్‌లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది.
విశ్వఖ్యాతి
ఆమెకు భయం ఎక్కువే.. కానీ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. ఆమెకు బాధా ఎక్కువే.. కానీ.. అన్ని బాధ్యతలు మోస్తుంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ.. ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా.. ఏ రంగాన్ని ఎంచుకున్నా అగ్రపథాన నిలుస్తున్నారు. ఆనాడు అక్షరాలు అంటే తెలియని మహిళలు నేడు డిజిటల్ మార్కెటింగ్‌లో రికార్డు సృష్టిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, పిల్లలను ఉన్నతంగా చవిదించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసు అంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ రంగంలో ఉత్సాహంగా రాణిస్తున్నారు. ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు. బీడీలు చుట్టిన చేతులు పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నాయి. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో వినిపించిన గొంతులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. పలువురు మహిళలు ఉమ్మడిగా ఏర్పడి ప్రారంభించిన హోంఫుడ్స్ ఖండాంతరాల్లో రుచులు పంచుతున్నాయి. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆదర్శ మహిళలపై ప్రత్యేక కథనం..!!
మహిళల భద్రతకు పెద్దపీట
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుత సమాజంలో వారికున్న స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయాలు.. తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా.. 100మంది మహిళలు చెప్పిన సమాధానాలు ఇలా..
25%
కరీంనగర్‌క్రైం/హుజూరాబాద్:
‘అతివల భద్రతకు పోలీసుశాఖ పెద్దపీట వేస్తోంది. ఏ విషయంలోనైనా అన్యాయానికి గురైతే పోలీసుస్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి. నిందితులపై చర్యలు తీసుకుని, సత్వర న్యాయం అందేలా చూస్తాం. యువతులు భద్రత లేని ప్రైవేటు ఉద్యోగాల కన్నా పోలీసు ఉద్యోగంలోకి రావాలి. శివంగుల్లా నేరస్తుల భరతం పట్టాలి’. అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి. కుటుంబం అండగా ఉండడంతో పోలీసు ఉద్యోగంలో రాణిస్తున్నాని వెల్లడించారు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తామని సూచిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.
మహిళల భద్రతకు పోలీసింగ్‌లో మార్పులు
పోలీసుశాఖలోని షీటీంలు మహిళల కోసం పని చేస్తాయి. సైబర్‌క్రైం యూనిట్ల ద్వారా నిందితులను త్వరగా పట్టుకుంటున్నాం. స్పెషల్ ఉమెన్ స్టాల్స్, మహిళా బ్లూకోల్ట్స్, హ్యాక్‌ఐ యాప్, సీసీ కెమెరాలు, భరోసా సెంటర్, షీ బాక్కులు, హెల్ప్‌లైన్ సెంటర్లు మహిళల కోసం ఏర్పాటు చేసినవే. మహిళలు రాత్రివేళలలో వెళ్లేప్పుడు సురక్షిత మార్గాలు ఎంచుకోవాలి. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే వాహన నంబర్లు కుటుంబసభ్యులకు మెసేజ్ చేయాలి. లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 181, 8712670759 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి.
నేరాలు పెరుగుతున్నాయి
గృహహింస, సైబర్‌నేరాలు, స్టాకింగ్, లైంగికదాడి కేసులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, మైనర్లపై ప్రేమపేరుతో జరుగుతున్న మోసాలపై బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటో, వీడియో మార్ఫింగ్ కేసులు పెరుగుతున్నాయి. గృహహింస కేసుల్లో బాఽధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కుటుంబ ఒత్తిడి, వారి పిల్లల భవిష్యత్తు, ఆర్థికపరమైన ఇబ్బందులు భరించలేక చాలామంది కేసుల్లో రాజీ పడుతున్నారు. దీంతో నిందితులకు శిక్ష పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలకు స్వేచ్ఛగా వారి సమస్యను తోటి మహిళా అధికారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు స్వయంగా పోలీసుల సాయం తీసుకోవచ్చు.
పోలీసు ఉద్యోగం సవాలే
పోలీసుశాఖలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ధైర్యం, నిబద్ధత, పారదర్శకతతో పనిచేయడం ద్వారా ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. పోలీసు ఉద్యోగం ప్రతిరోజు సవాల్‌గానే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదు. నా 30ఏళ్ల సర్వీసులో ఎస్సై, సీఐ, ప్రస్తుతం ఏసీపీగా కొనసాగుతున్నా పోస్టింగ్‌లో మహిళ అన్న వ్యత్యాసం ఎక్కడా చూడలేదు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. డిపార్డుమెంటులో చేరేందుకు యువతులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి రక్షణలేని కాల్‌సెంటర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కన్నా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుశాఖలోకి రావాలి. ఈ ఉద్యోగంతో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చు.
నన్ను కదిలించిన ఘటన అదే..
ప్రేమపేరుతో మోసపోయి, లైంగికదాడికి గురైన ఓ బాధితురాలు పిచ్చిదైపోయింది. ఆ ఘటన ఆమె జీవితాన్నే మార్చింది. మానసిక వైకల్యం కింద నెలనెలా పెన్షన్ తీసుకోవడం నాకు బాధనిపించింది. ఆ కేసులో నిందితుడికి శిక్షపడేలా చేశాను. బాధితురాలికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద రూ.5 లక్షలు ఇప్పించేందుకు ముందుండి పనిచేశాను. తనుకు చేసిన తరువాత సాయం నాకు గర్వంగా అనిపించింది. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల తల్లులు ఓటువేసి వచ్చే వరకు, పిల్లలను లాలించడం ఆనందంగా అనిపించేది.
ధైర్యంగా ముందుకు సాగాలి
మహిళలు బాధితులుగా ఉన్న కేసుల్లో సామాజిక అవగాహన లోపం, లేట్ రిపోర్టింగ్‌తో నిందితులకు త్వరగా శిక్ష పడడం లేదు. కొన్ని కేసుల్లో సాక్ష్యులను కోర్టుకు రప్పించడంలో కష్టమైనా ముందుకు వెళ్తున్నాం. స్పీడ్ ట్రయల్ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళలు ధైర్యంగా ఉండాలి. తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండి, ఆపద సమయంలో పోలీసులసాయం పొందాలి. అందరికీ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
8 మంది
100%
50%
40 మంది
2
52 మంది
స్నేహితుల సూచన
తల్లిదండ్రుల నిర్ణయం
8
మీరు
ప్రస్తుతం
ఎంచుకున్న
కోర్సును
సొంత
నిర్ణయంతో
చేస్తున్నారా?
సొంత
నిర్ణయం
లేదు
90
మీ నిర్ణయాలకు మీ
ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తుంది?
సమాజం
ఒక సీ్త్ర
స్వతంత్రంగా
ముందుకు
వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం?
4
93
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్‌నాయక్ తండాకు చెందిన బట్టు మంగవ్వ.
నలుగురు సంతానం
మంగవ్వ– హరిచంద్ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్ గల్ఫ్‌దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్‌కుమార్ ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. నిర్మల్‌లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్‌లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్ ఎన్‌ఏసీలో ల్యాండ్ సర్వేయర్‌గా శిక్షణ పొంది, కరీంనగర్ కలెక్టరేట్‌లో సర్వేయర్‌గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు.
కుటుంబం
3
స్నేహితులు
– సప్తగిరికాలనీ(కరీంనగర్)
తన
పిల్లలతో బట్టు మంగవ్వ
44
52
విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అతివల ప్రతిభ
కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లలను
తీర్చిదిద్దుతున్న వైనం
ఖాకీ చొక్కా వేసుకుని బాధితులకు
సత్వర న్యాయం
పల్లెపాటల గొంతుకు ప్రపంచ గుర్తింపు
అమ్మచేతి వంటకు విదేశాల్లో అభిమానులు
ఆదర్శం.. ఉమ్మడి జిల్లాలోని పలువురు అబలలు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మీరు తీసుకునే రోజూవారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు?


