మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

Mar 8 2026 7:57 AM | Updated on Mar 8 2026 7:57 AM

● దేశంలోనే తెలంగాణ రోల్‌ మోడల్‌ ● ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

● దేశంలోనే తెలంగాణ రోల్‌ మోడల్‌ ● ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

చందుర్తి/వేములవాడఅర్బన్‌: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి మండలం మూడపల్లి, కట్టలింగంపేటల్లో శనివారం మహిళా సంఘాల భవన నిర్మాణాలకు భూమిపూజ, తిమ్మాపూర్‌, రామన్నపేటల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వేములవాడఅర్బన్‌ మండలం చీర్లవంచలో ఇందిరమ్మ గృహప్రవేశానికి ప్రభుత్వ విప్‌ హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. విప్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ఎంపీడీవో రాధ, సర్పంచులు చిలుక మల్లేశ్వరీ, కాపిల్ల శంకర్‌, పోతురాజు భారతి, ఆవా రి రమేశ్‌, రుద్రంగి ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement