అంగన్‌వాడీ ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఏర్పాటు చేయండి

Mar 8 2026 7:19 AM | Updated on Mar 8 2026 7:19 AM

అంగన్‌వాడీ ఏర్పాటు చేయండి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

వందలాది కుటుంబాలు ఉండే కాలనీ ఇది. అందరూ పేదలే. పిల్లల కోసం అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. డ్రైనేజీల్లో నీరు ప్రవాహం లేక మురుగురోడ్లపై పారుతుంది. పాడైన డ్రైనేజీ స్థానంలో కొత్తగా నిర్మించాలి. నిత్యం చెత్తను ఊడ్చేలా చూడాలి. తాగునీటి కొరతను తీర్చాలి.

– గాలి లత

బీజేపీతోనే దేశ కీర్తి విశ్వవ్యాప్తం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): బీజేపీతోనే దేశ కీర్తిని చాటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. పండిత్‌ దీన్‌ దయాళ్‌ స్ఫూర్తిగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అధికారం ఉన్నప్పుడే ప్రజలకు ఏదైనా చేయగలమన్నారు. పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, సర్పంచ్‌ నక్కదాసరి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు మెరుగు అంజాగౌడ్‌, శీలం రాజు, గోపికృష్ణ, మహేందర్‌, శ్రీనివాస్‌రావు, రమేశ్‌, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

లారీ, కారు ఢీ

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో శనివారం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో కారు లారీ ముందు భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాలేవు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement