బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో ప్రతీశాఖ కార్యాలయం పరిశుభ్రంగా ఉంచాలని డీఆర్డీవో మచ్చ గీత, డీపీవో షర్ఫొద్దీన్ పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి హైస్కూల్, నీలోజిపల్లి జీపీ పరిసరాలను డీఆర్డీఓ గీత, కొదురుపాక, బోయినపల్లి పీహెచ్‌సీలను డీపీవో షర్ఫొద్దీన్ శనివారం పరిశీలించారు. ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్ ఉన్నారు.
12న హుండీ లెక్కింపు
వేములవాడ: భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఈనెల 12న లెక్కించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భీమేశ్వర సదన్‌లోని పార్కింగ్ స్థలంలో లెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు.


