ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్.. బూర్గుల రామకృష్ణారావు ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యంలో భాస్కర్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ఆధ్వర్యంలో ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నారు.
ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం పోతుగల్‌లో ట్రాక్టర్ బోల్తా పడ్డ సంఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. పోతుగల్‌లో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నందకుమార్(26), పూర్ణకుమార్(36) శనివారం రాత్రి ట్రాక్టర్‌పై వెళ్లారు. వీరు నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇంజిన్ భాగం బోల్తా పడడంతో నందకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పూర్ణకుమార్‌ను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


