శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కనులపండువగా సాగింది. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో గుడి చెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి వారికి మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు రాజన్నను వివాహమాడి తలంబ్రాలు చల్లుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ సంపత్, మేనేజర్ సంపత్‌రెడ్డి, ఎస్పీ మహేశ్ బీ గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, బీజీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.


