సిరిసిల్ల క్రైం: జిల్లాకు బదిలీపై వచ్చిన సీఐలు శుక్రవారం విధుల్లో చేరారు. ఎస్పీ మహేశ్ బీ గీతేపాటు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల టౌన్ సీఐగా నెమ్మని శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట సీఐగా వెంకటేశ్, సిరిసిల్ల రూరల్ సీఐగా కదిరే నాగేశ్వరరావు విధుల్లో చేరారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల శివారులోని బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. పుట్టగొడుగుల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె.బి.సునీతదేవి తెలిపారు. ప్లాంట్ పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.అశ్విని పుట్టగొడుగుల తయారీలో మెలకువలు వివరించగా, మార్కెటింగ్‌పై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.యశస్విని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లను అందజేసింది.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో సాగునీటి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారంతో ఏడో రోజుకు చేరింది. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని ఆర్‌డీ3, ఎల్‌ఎం6, ఎల్‌ఎం4 కాలువ పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో ఆగ్రహించిన రైతులు, తమ నిరసనను ఉధృతం చేశారు. రైతులు ముఖేశ్, పవన్, నర్సింగం, భాస్కర్, రమేశ్, శ్రీధర్‌రావు, తిరుపతి, రాజిరెడ్డి, విజయ్‌రెడ్డి, బాలకృష్ణ, సురేష్, లక్ష్మణ్, మహేందర్, అంజయ్య, హరీశ్ పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని దుబ్బాక మార్గంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండడంతో స్థానికులు ఓ కర్రను ఊతంగా పెట్టారు. విద్యుత్ మెయిన్ లైన్‌తోపాటు సర్వీస్‌వైర్లు కిందకు రాకుండా కర్రను పెట్టారు. ప్రమాదం జరగక ముందే లూజ్ తీగలకు పోల్స్ వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. గతంలో లూజ్ విద్యుత్ తీగల కోసం పెద్ద ఎత్తున స్తంభాలు వేసి, మరి ఎందుకో ఇక్కడ స్తంభాలను ఏర్పాటు చేయలేదు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 8 మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. సిరికొండ పాఠశాల నుంచి దాసరి కోటి, దాచారం నుంచి గజ్జెల సిద్దు, వల్లంపట్ల నుంచి గంగాధర సౌమ్య, ఇల్లంతకుంట నుంచి ఎనుగంటి శశివర్ధన్, కందికట్కూర్ నుంచి రాచకొండ అశ్విత, ఏగుర్ల రేష్మిత, గాలిపెల్లి నుంచి ఎండ్ర సంజన, వివేకానంద, పొత్తూరు హైస్కూల్ నుంచి బుర్ర మనస్విని ఎంకియ్యారు. ఎంపికై న విద్యార్థులు తమ కొత్త ఆవిష్కరణల కోసం ఖాతాలలో ప్రభుత్వం రూ.10వేలు జమచేయనుంది.


