వైద్యనిపుణుల సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యనిపుణుల సేవలు వినియోగించుకోవాలి

Mar 7 2026 7:20 AM | Updated on Mar 7 2026 7:20 AM

● జిల్లా వైద్యాధికారి రజిత

● జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల: జిల్లాలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత కోరారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిర్ధేశిత రోజుల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 6 నుంచి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు చేస్తారని తెలిపారు. పోషకాహారం, వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా సీ్త్రలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు.

వైద్యశిబిరాల షెడ్యూల్‌ ఇదీ..

మార్చి 7న హన్మాజీపేట, 9న కోనరావుపేట, 10న లింగన్నపేట, 11న పోతుగల్‌, 12న విలాసాగర్‌, 13న ఎల్లారెడ్డిపేట, 14న పెద్దలింగాపూర్‌, 16న నేరెళ్ల, 17న తంగళ్లపల్లిలో వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. 18న కొదురుపాక, 20న సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, 23న అంబేడ్కర్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, 24న చీర్లవంచ, 25న బోయినపల్లి, 26న కోనరావుపేట, 28న పోతుగల్‌, 30న విలాసాగర్‌, 31న సుందరయ్యనగర్‌లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.

అన్నదాన ట్రస్టుకు రూ.2లక్షలు విరాళం

వేములవాడ అర్బన్‌: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు రూ.2లక్షలు విరాళం శుక్రవారం అందజేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు చెందిన బొమ్మవేణి సౌజన్య–రాజేశ్వర్‌రెడ్డి దంపతులు రూ.2లక్షలు విరాళం అందించగా, ఈ సందర్భంగా అన్నప్రసాదానికి రూ.1.82లక్షలు, శాశ్వత అభిషేకానికి రూ.18వేలు సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రొటోకాల్‌ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement