ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో
పూజలందుకుంటున్న స్వామివారు
స్వామివారి శావ మోస్తున్న సీఐ
రాంనర్సింహారెడ్డి, పోలీస్ అధికారులు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహుని దక్షిణ దిగ్యాత్ర గురువారం విజయవంతంగా సాగింది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ధర్మపురి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వామివారికి స్వాగతం పలికారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించిన అనంతరం వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్‌వరకు అశ్వవాహనంపై స్వామివార్లను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, ఎస్సైలు మహేశ్, రమేశ్, ఉదయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


