‘సెస్’ సంస్థ రూ.కోట్ల అవినీతికి అడ్డాగా మారింది. పాలకవర్గాలు రూ.130 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. 3 లక్షల మందికి సేవలందించే సంస్థ రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మొక్కుబడిగా పనిచేస్తుంది. ఈ అవినీతికి ‘సెస్’ పాలకవర్గం సభ్యులు బాధ్యులు కాదా? విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. – బి.పెద్దన్న, వినియోగదారుడు
దీపావళి పూట టపాసులు కాల్చి ‘సెస్’ ఆఫీస్ రికార్డులను కాల్చిన సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలీసు కేసు ఏమైంది. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు. ఏళ్లుగా కొందరు ఉద్యోగులు ఇక్కడే పాతుకుపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని బదిలీ చేయండి.
– దేవయ్య, వినియోగదారుడు
విద్యుత్ అక్రమ వినియోగాన్ని కట్టడి చేయాలి. ‘సెస్’ పరిధి లో నూ ప్రజావాణిని ఏర్పాటు చేసి వినియోగదారుల సమస్యలు ప రిష్కరించాలి. సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,221.16 కోట్ల బకాయిలను విడుదల చేయాలి. కరెంట్‌షాక్‌తో ఎవరైనా మరణిస్తే రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలి.
– జోగినిపల్లి సంపత్‌రావు, వినియోగదారుడు


