కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ 2025 అక్టోబర్ 23న విధుల్లో చేరారు. అప్పటికీ కలెక్టర్‌గా ఉన్న హరిత దీర్ఘకాలిక సెలవులో వెళ్తూ.. ఇన్‌చార్జి బాధ్యతలను గరీమా అగ్రవాల్‌కు అప్పగించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. ఆమె సమర్థతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు అర్చకులు ఆశీర్వచనం అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పలువురు జిల్లా అధికారులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ఏవో రామ్‌రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


