కానిస్టేబుళ్లకు రివార్డులు
● విధుల్లో ధైర్యసాహసాలకు గుర్తింపు
సిరిసిల్ల క్రైం: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. రివార్డుతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇటీవల వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గంగరాజును ప్రత్యేకంగా అభినందించారు. తంగళ్లపల్లి వద్ద మానేరువాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్ సేవలను కొనియాడారు.
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో రూ.70 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు సముదాయ భవన పనులకు మార్చి 7న శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్‌సింగ్‌తోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కోర్టులు కొనసాగుతుండగా.. శాశ్వత సొంత భవన నిర్మాణానికి మార్చి 7న భూమి పూజ చేయనున్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు రచించిన పద్యాలు, కవితల పుస్తక సంకలనం ‘గునుగు పూలు’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. సాహితీవేత్తలు వెంకటేశ్వర్లు, పర్శరాములు, గరిపల్లి అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెచ్‌ఎం గంగారాం, సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, తెలుగు భాషోపాధ్యాయులు నరేందర్, రాజయ్య పాల్గొన్నారు.
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో వందశాతం పన్నుల వసూలు చేయాలని డీఎల్‌పీవో వీరభద్రయ్య సూచించారు. ముస్తాబాద్ మండల పరిషత్‌లో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. మార్చి నెలాఖరులోపు వందశాతం పన్నులు వసూలు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాజీద్ పాల్గొన్నారు.
చిరుతదాడిలో గేదెకు గాయాలు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని వట్టిమల్లలో చిరుత దాడిలో ఓ గేదెకు గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని వట్టిమల్లకు చెందిన రైతు నల్ల చిన్నమల్లారెడ్డి తన పొలం వద్ద కొట్టంలో పశువులను కట్టేసి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా గేదె కన్నుకు గాయమైంది. చిరుతపులి దాడి చేసినట్లు భావిస్తున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించగా సెక్షన్ అధికారి అన్వర్ హుస్సేన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కానిస్టేబుళ్లకు రివార్డులు
కానిస్టేబుళ్లకు రివార్డులు


