అడ్వకేట్‌ దంపతులకు ఆశ్రయం | - | Sakshi
Sakshi News home page

అడ్వకేట్‌ దంపతులకు ఆశ్రయం

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

అడ్వక

అడ్వకేట్‌ దంపతులకు ఆశ్రయం

వేములవాడ/వేములవాడరూరల్‌: రాజన్న మెట్ల వద్ద విద్యావంతులు భిక్షాటన చేస్తున్న విషయంపై ‘సాక్షి’లో ఈనెల 25న ‘విద్యావంతులు.. ఈ బిచ్చగాళ్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ఆధ్వర్యంలో గురువారం దంపతులను మండెపల్లి అనాథ ఆశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడ జలంధర్‌రెడ్డికి కటింగ్‌ చేయించి, నూతన వస్త్రాలు అందించారు. అక్కడి నుంచి వేములవాడ రాజన్న వసతి గదులైన పార్వతీపురంలో ప్రత్యేకంగా వసతిని ఏర్పాటు చేశారు. ఇక నుంచి రాజన్న మెట్ల వద్ద ఉండవద్దంటూ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ప్రభుత్వపరంగా సౌకర్యాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో అడ్వకేట్‌ కాసర్ల జలంధర్‌రెడ్డి దంపతులు ఆనందభాష్పాలతో అధికారులకు కృతజ్ఞతలు, ‘సాక్షి’ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు. వేములవాడకు చెందిన అడ్వకేట్‌ పంపరి శంకర్‌ వారిక భరోసా కల్పించడంతోపాటు ఆర్థిక సహాయం అందించారు.

అడ్వకేట్‌ దంపతులకు ఆశ్రయం1
1/1

అడ్వకేట్‌ దంపతులకు ఆశ్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement