గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
● వేములవాడ–కోరుట్ల ఫోర్‌లేన్ రోడ్డు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం లింగంపేటలో ఇందిరమ్మ లబ్ధిదారులు మారుపాక రోజ–సంజీవ్ దంపతులు గృహప్రవేశం నిర్వహించగా ప్రభుత్వ విప్ నూతన వస్త్రాలను అందజేసి, అభినందనలు తెలిపారు. స్థలం లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చేందుకు సీఎం రేవంతరెడ్డి ఆలోచిస్తున్నారన్నారు. వేములవాడ–కోరుట్ల ప్రధాన రహదారిని 100 ఫీట్లుగా ఫోర్‌లేన్‌గా నిర్మించనున్నట్లు తెలిపారు. ఎంపీడీవో రాధ, ఎంపీవో బండి ప్రదీప్‌కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సనుగుల సింగిల్‌విండో మాజీ చైర్మన్ ముష్కు ముకుందరెడ్డి, నాయకులు గొట్టే ప్రభాకర్, బండారి శేఖర్, హౌసింగ్ ఏఈ రవీందర్ పాల్గొన్నారు.


