ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
సిరిసిల్ల: వడ్డె ఓబన్న జయంతిని కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పాల్గొన్నారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): వరంగల్‌లో కాలేజీలో చదివే రోజుల్లో ఖర్చుల కోసం నేను కూడా రాత్రిపూట ఆటో నడిపానని.. కార్మికుల ఏంటో నాకు తెలుసునని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇల్లంతకుంటలో ఆదివారం మండల ఆటోకార్మికులకు కేటీఆర్ ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఆటోకార్మికులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆటోకార్మికులు అందరి కోసం బతుకుతారని పేర్కొంటూ ఉచిత బస్సు ప్రయాణంలో లోపాలున్నాయని పేర్కొన్నారు. ఆటో కార్మికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు రామ్మోహన్, మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, పల్లె నర్సింహారెడ్డి, ఒగ్గు నర్సయ్య, కమటం రాములు, కెవిన్‌రెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ వస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. స్థానిక శాంతినగర్‌లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వస్తున్నారని వివరించారు. పట్టణంలోని పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.
వేములవాడ: ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు చేసిన పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను సామాజిక కార్యకర్త పుప్పాల మోహన్ ఆదివారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట తగులబెట్టారు. మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డులలో అక్రమంగా ఇతర గ్రామాల నుంచి ఓటర్లు నమోదు చేయించారన్నారు. ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఈనెల 8న 11వ వార్డులో దాదాపు 400లకుపైగా ఇతర గ్రామాలకు చెందిన వారిని ఓటర్లుగా నమోదు చేయించారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు నిబంధనల మేరకు ఏమీ చేయలేమని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో ఓ ప్రధాన పార్టీకి చెందిన ఆశావహుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆదివారం ఉదయం వరకు చినిగిపోయి ఉంది. దీనిపై ఫ్లెక్సీ ప్రదర్శించిన వ్యక్తి అదే వార్డుకు చెందిన మరో ప్రధాన పార్టీ నేత కారకుడిగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈవిషయంపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి


