ఉపాధిహామీ పేరు మార్చడం దుర్మార్గం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇరువై ఏళ్లుగా పేదలకు ఉపాధి కల్పించిన ఉపాధిహామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను ఆదివారం ముస్తాబాద్‌లో నిర్వహించారు. కొత్తబస్టాండ్ నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శత జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. నాయకులు శంకర్, సదానందం, గుంటి వేణు, మీసం లక్ష్మణ్, రాకేశ్, భూదయ్య, నర్సయ్య పాల్గొన్నారు.
కామ్రెడ్ గోపాల్‌రావు సేవలు చిరస్మరణీయం
భూస్వామి కుటుంబంలో పుట్టినా పేదల కోసం పనిచేసిన కామ్రెడ్ గోపాల్‌రావు సేవలు చిరస్మరణీయమని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పోతుగల్‌లో మాజీ సర్పంచ్ తన్నీరు గోపాల్‌రావు స్మారకార్థం నిర్మించే కార్మిక భవన్‌కు భూమిపూజ చేశారు. గో పాల్‌రావు కుమారులు ప్రభాకర్‌రావు, వెంకట్‌రా వు, శ్రీరంగారావులు భవనం నిర్మిస్తున్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, సర్పంచ్ పెద్దిగారి యా దమ్మ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కనమేని చక్రధర్‌రెడ్డి, గౌతంరావు, సుధాకర్‌రావు, నారాయణరావు, వెంకట్‌రావు, తోట ధర్మేందర్, శంకర్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు.


