
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్‌ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
సెల్‌ఫోన్ అప్పగింత
కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్‌లో రాజేశ్ సెల్‌ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్‌లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు.