
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్‌కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్‌ఏ సాప్ట్‌వేర్ ఇంజినీరు. దయానంద్‌పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్‌ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్‌నగర్‌లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్‌లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్‌కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు.

బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్‌కు శ్రీకారం

బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్‌కు శ్రీకారం

బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్‌కు శ్రీకారం