చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక జైశ్వాల్‌ | - | Sakshi
Sakshi News home page

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక జైశ్వాల్‌

Aug 3 2025 3:00 AM | Updated on Aug 3 2025 3:00 AM

చట్టా

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రతీ ఒక్కరు చట్టాల గురించి తెలుసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్‌ రాధిక జైశ్వాల్‌ కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో శని వారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. జస్టిస్‌ రాధిక జైశ్వాల్‌ మా ట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి తెలుసుకోవాలన్నారు. లోక్‌ అ దాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, అడ్వకేట్‌ ఆడెపు వేణు, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ జె.పర్శరాములు, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ ఎస్‌.మల్లేశ్‌యాదవ్‌, సీనియర్‌ అడ్వకేట్‌ కుంట శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహానా ఇఫ్ఫత్‌ పాల్గొన్నారు.

భూగర్భ జలాలను కాపాడాలి

రుద్రంగి(కోనరావుపేట): మండలంలోని నిమ్మపల్లి మూలవాగులో భూగర్భ జలాలను కాపాడాలని కోరుతూ ఆ గ్రామస్తులు డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌కు శని వారం వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లి మూలవాగు నుంచి నిమ్మపల్లి, వట్టిమల్ల, మరిమడ్ల, బావుసాయిపేట, కోనరావుపేట, కొండాపూర్‌, వెంకట్రావుపేట గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు ఇచ్చారన్నారు. ఆయా గ్రామస్తులు ఇసుక తోడుతుండడంతో భూగ ర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోగు ప్రతాపరెడ్డి, దొంతరవేణి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

బిల్లులు విడుదల చేయాలి

సిరిసిల్ల అర్బన్‌: రాష్ట్రంలో తాజా, మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా, మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనిపల్లి కరుణాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. జనహిత పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్‌ గ్రామాల్లోని మాజీ సర్పంచులు చేసిన పనులు తెలుసుకొని బిల్లులను విడుదల చేయించా లని కోరారు. ఉపాధ్యక్షుడు గున్నాల లక్ష్మణ్‌, ఆరె మహేందర్‌, సిరికొండ శ్రీనివాస్‌, రవినాయక్‌, శ్రీనివాస్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

త్రిఫ్ట్‌ డబ్బులు ఇప్పించాలి

చేనేత, జౌళిశాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు వినతి

సిరిసిల్లటౌన్‌: నేతన్నలకు రావాల్సిన త్రిఫ్ట్‌ పథకం డబ్బులు చేనేత దినోత్సవం రోజున అందించేలా చూడాలని పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. సిరిసిల్లలోని బీవై నగర్‌ చేనేత, జౌళి శాఖ ఆఫీస్‌లో జేడీ ఎన్వీ రావును శనివారం కలిసి ఈమేరకు విన్నవించారు. పవర్‌లూమ్‌, అనుబంధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న 10 శాతం యారన్‌ సబ్సిడీ, త్రిఫ్ట్‌ పథకం, వర్కర్‌ టు ఓనర్‌, కార్మికుల ఉపాధి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. వార్పిన్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్‌, చింతకింది సుదర్శన్‌, దోమల రామ్‌ ఉన్నారు.

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ1
1/3

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ2
2/3

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ3
3/3

చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement