
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ/రుద్రంగి(వేములవాడ): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌హౌస్‌ను శనివారం అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతును రాజును చేసేందుకు రుణమాఫీ, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి రాందాస్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తర్రె లింగం తదితరులు పాల్గొన్నారు.
144 మందికి పట్టాలు
వేములవాడలో సొంత ఇల్లు, గజం జాగ లేని పేదలు 144 మందికి బస్‌డిపో పక్కన గల డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్ల స్థలంలో పట్టాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. లబ్ధి దారులకు శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. 12 బ్లాకులలో జీప్లస్ 2తో 144 ఇండ్లు ఉంటాయన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పాల్గొన్నారు.