మానేరులో ఆరు ఇసుక రీచ్‌లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో కొత్తగా ఆరు ఇసుక రీచ్‌లను గుర్తించామని, స్థానిక అవసరాలకు, అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పదిర, కొండాపూర్‌లో ఇసుక రీచ్‌లను మంగళవారం ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. పదిర ఇసుక రీచ్ ప్రారంభించిన తర్వాత వెంకటాపూర్ రీచ్‌ను నిలిపివేయాలని తెలిపారు. వట్టిమల్ల అప్రోచ్‌రోడ్ సమస్యపై తహసీల్దార్ నివేదిక అందించాలని కోరారు. జిల్లాలో నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, జిల్లా మైనింగ్ అధికారి క్రాంతికుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, ప్రోగ్రాం అధికారి టీజీఎండీసీ పీవో జైపాల్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


