రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి

Apr 6 2025 1:53 AM | Updated on Apr 6 2025 1:53 AM

రైతులు సేంద్రియ  వ్యవసాయం చేయాలి

రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి

కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

మల్లాపూర్‌: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామీణ అవార్డులు ప్రదానం చేశారు. మల్లాపూర్‌ మండలం రాఘవపేటకు చెందిన మెండె శ్రీనివాస్‌ రూపొందించిన నీరటి రోబో ప్రదర్శనకు కేంద్రమంత్రి చేతులమీదుగా గ్రామీణ అవార్డు అందుకున్నారు. రసాయనాలు వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది భవిష్యత్‌ తరాలకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు.

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు

శంకరపట్నం: మండలంలోని తాడికల్‌ శివారులో శనివారం రెండు మోటర్‌సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని తాడికల్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌చారి కరీంనగర్‌ నుంచి స్వగ్రామం మోటర్‌సైకిల్‌పై వస్తుండగా డీబీఎల్‌ కంపెనీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కృష్ణ మోటర్‌సైకిల్‌తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు.

పంచాయతీ కార్యదర్శికి గాయాలు

శంకరపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని కన్నాపూర్‌ పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కన్నాపూర్‌ గ్రామపంచాయతీలో శనివారం విధులకు హాజరై తిరిగి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఆముదాలపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108వాహనంలో హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

కత్తితో బెదిరించిన వ్యక్తి రిమాండ్‌

సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని ఇప్పలపల్లికి చెందిన సలేంద్రి రాకేశ్‌ అనే యువకుడు చేతిలో కత్తి పట్టుకొని పలువురిని బెదిరించిన ఘటనలో శనివారం రిమాండ్‌ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు గతంలో వేములవాడలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. మళ్లీ కత్తితో శనివారం రాత్రి పలువురిని బెదిరించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలా నికి వెళ్లగా.. వారి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement