పండుగ పూట వెలుగులు
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఎల్‌ఈడీ లైట్లు బిగించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని వీధిలైట్లను బాగు చేయించడంతో విద్యుత్‌కాంతులు వెదజల్లుతున్నాయి. నూతన పాలకవర్గం గ్రామంలో వీధిలైట్లు బిగించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బుగ్గరాజేశ్వరతండాలో..
ఆ గిరిజన తండా సర్పంచ్ బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవా చేస్తున్నారు. మొన్న చెత్తట్రాక్టర్ నడిపిన బుగ్గరాజేశ్వరతండా సర్పంచ్ అజ్మీర తిరుపతినాయక్ సంక్రాంతి పండుగపూట గ్రామంలోని చీకట్లను తరిమేందుకు తన సొంత ఖర్చులతో బుధవారం వీధిలైట్లు ఏర్పాటు చేయించారు.
మహిళలకు ఆటవిడుపు
భోగిని పురస్కరించుకొని సిరిసిల్లలోని శాంతినగర్‌లో బుధవారం బీజేపీ నాయకురాలు పోకల భవాని ఆధ్వర్యంలో మహిళలకు ఆటలపోటీలు నిర్వహించారు. పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో దాదాపు 30 నుంచి 40 మంది మహిళలు పాల్గొన్నారు. వీరికి టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల
పండుగ పూట వెలుగులు
పండుగ పూట వెలుగులు


