సైబర్ మోసం.. నగదు మాయం
వీణవంక: పీఎంకే ఫైల్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వీణవంక మండలం కనపర్తి గ్రామంలో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు లింకు రావడంతో ఓపెన్ చేశాడు. నత ఖాతా నుంచి రూ.10వేలు మాయమయ్యాయి. మరి కొంత మందికి లింకు రావడంతో ఓపెన్ చేసినట్లుగా తెలిసింది. వారి డబ్బులు కూడా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన బాధితులు వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫోన్లో కాంటాక్ట్ ఉన్న అందరికీ సందేశం రావడంతో గ్రామస్తులు జంకుతున్నారు. బాధితుడు నాలుగు రోజులుగా ఫోన్‌ను స్విచ్ఛాప్ చేశాడు. ఇటీవల బేతిగల్‌లో ఓ మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.29500 మాయం చేశారు. హిమ్మత్‌నగర్ గ్రామంలో ఓ మహిళకు ఆర్‌టీఏ పెండింగ్ చలాన్ పేరుతో సందేశం రావడంతో లింకు ఓపెన్ అయ్యింది. మహిళ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి సందేశం ఓపెన్ చేయడంతో రూ.20వేలకు పైగా సైబర్‌నేరగాళ్లు కొట్టేసినట్లు తెలిసింది.
పండుగపూట విషాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గనగోని శ్రీనివాస్(50) బుధవారం బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. శ్రీనివాస్‌కు భార్య లావణ్య, ఇద్దరు కొడుకులు లక్కీ, అభిషేక్ ఉన్నారు.


