పట్టించుకోరామా !
దాతలు చేసిన అభివృద్ధి పనులు ఇవే..
కోనరావుపేట(వేములవాడ): భక్తుల కొంగుబంగారంలా నిలుస్తున్న కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధిపై పాలకులకు పట్టింపు కరువైంది. దత్తత తీసుకున్న రాజన్న ఆలయం సైతం నిధులు సమకూర్చడం లేదు. ఫలితంగా దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కల్పించిన సౌకర్యాలే ఉన్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు దరిచేరాలంటే ప్రభుత్వం స్పందిస్తేనే వస్తాయని భక్తులు నమ్ముతున్నారు.
రాజన్న దత్తత ఆలయంగా..
మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి విశేష ప్రాముఖ్యత ఉంది. కానీ అభివృద్ధి జరుగకపోవడంతో ఈ ఆలయంతోపాటు నాంపెల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని వేములవాడ రాజన్న దత్తత గ్రామంగా తీసుకున్నారు. నాంపెల్లి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన అధికారులు, మామిడిపల్లి ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దత్తత తీసుకున్నా ఎలాంటి పనులు జరుగకపోవడంతో పలువురు దాతలు ముందుకురావడంతో కొంతమేర సౌకర్యాలు ఏర్పాటయ్యాయి.
మరికొద్ది రోజుల్లో జాతర ఉత్సవాలు
మామిడిపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జనవరి 18న మాఘం అమావాస్య జాతర జరుగనుంది. గత జాతర ఉత్సవాల్లో ఘాట్‌రోడ్డు పనులు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించినా కాంట్రాక్టర్‌లో మాత్రం చలనం రావడం లేదు. మళ్లీ జాతర ఉత్సవాలు సమీపిస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడం గమనార్హం.
పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన వసతిగది
నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీపతి, వెంకటగిరి రూ.7 లక్షలతో గుట్టపైకి వెళ్లే మెట్లపై రేకులు వేయించారు.
వ్యాపారి జనార్దన్‌రెడ్డి రూ.5లక్షలతో గదిని నిర్మించారు.
మామిడిపల్లి మేర సంఘం ఆధ్వర్యంలో రూ.3లక్షలతో రేకులషెడ్డు నిర్మించారు.
అమెరికాలో ఉంటున్న ఎన్నారై ఆత్మారాం రూ.5లక్షలతో వసతిగృహం నిర్మించి ఇచ్చాడు.
అశోక్‌రావు రూ.3లక్షలతో మరో షెడ్డు వేయించారు.
1981 కనగర్తి ఎస్సెస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో రేకులషెడ్ నిర్మించారు.
వ్యాపారి హన్మంతరావు గర్భగుడిలో టైల్స్ వేయించారు.
పట్టించుకోరామా !


