
రాజన్న: నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఒకరు మృతిచెందిన సంఘటన గురువారం తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిరిసిల్లకు వస్తుండగా తంగళ్లపల్లికి చేరుకోగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా రన్నింగ్ బస్సులో నుంచి దూకాడు.
తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికి తెలియకపోవడంతో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.