యర్రగొండపాలెం: మద్యం సీసాపై రూ.20 వసూలు చేసుకొని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు.. కరప్షన్‌బాబుగా మారాడని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఆ విషయాన్ని మద్యం దుకాణాల నిర్వాహకులే స్వయంగా చెపుతున్నారని అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆ ప్రతి మద్యం వినియోగదారుడి కష్టార్జితాన్ని దోచుకోవడం ఎలాంటి రాజకీయమో ఎల్లో నినో బాబు ప్రజలకు వివరించాలని అన్నారు. మద్యంపై అనధికారికంగా అదనంగా వసూలు చేస్తున్న ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది... చంద్రబాబుదా? లోకేష్‌దా? అని ప్రశ్నించారు. లిక్కర్ షాపు యజమానులు ఏ అధికారిక అనుమతితో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారికి కలెక్టర్, ఆర్డీఓ అనుమతి ఇచ్చారా అని నిలదీశారు. అదనపు వసూళ్లపై విచారణ జరపటానికి అధికారులు ఎందుకు భయపడుతున్నారని అన్నారు.
ఉలవపాడు: మండల పరిధిలోని చాకిచర్ల శ్రీశ్రీ నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు రూ.3 లక్షలు పలికింది. వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ పాటలో అదే గ్రామానికి చెందిన జూటూరి తులసీరామ్ రూ.3 లక్షలకు పాటలో లడ్డును దక్కించుకున్నారు. తులసీరామ్‌ను వినాయక విగ్రహ కమిటీ సభ్యులు సత్కరించారు.


