పెద్దదోర్నాల: మండల పరిధిలోని చిన్నమంతనాల, పెద్దపెంట బేస్‌క్యాంపు ప్రాంతాలను పీపీసీఎఫ్ రాహుల్ పాండే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులతో కలిసి పెద్దపెంటలో పురోగతిలో ఉన్న టైగర్ ఎన్‌క్లోజర్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం చిన్న మంతనాల బేస్‌క్యాంపును పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీసీసీఎఫ్ రాహుల్‌పాండే వెంట నంద్యాల ప్రాజెక్టు డైరక్టర్ యశోదాభాయి, మార్కాపురం డిప్యూటీ డైరక్టర్ అబ్దుల్ రవూఫ్, ఆత్మకూర్ డిప్యూటీ డైరక్టర్ విఘ్నేష్ అపావు రేంజి అధికారులు పాల్గొన్నారు.


