మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితురాలిని. మాకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. గెజిట్‌లో కూడా మా పేరు ఉంది. అయినా ఇప్పటి వరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందలేదు. ప్యాకేజీ డబ్బులు జమ చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలను అధికారులు తప్పుగా నమోదు చేశారని, అందుకే ప్యాకేజీ రాలేదని అధికారులు చెబుతున్నారు. మా తప్పు లేకపోయినా ఖాతా వివరాల విషయంలో సమస్య తలెత్తడంతో ప్యాకేజీకి దూరమవుతున్నాం. గెజిట్‌లో పేరు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా ప్యాకేజీ అందకపోవడం వల్ల మా కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అధికారులు మా బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి పరిశీలించి తప్పులను సరిచేసి, మాకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని వెంటనే అందించాలని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– కొప్పుల గాలెమ్మ, గొట్టిపడియ


