జీవిత కాలం లేటు! | - | Sakshi
Sakshi News home page

జీవిత కాలం లేటు!

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

జీవిత

జీవిత కాలం లేటు!

న్యూస్‌రీల్‌

నేడు కలెక్టరేట్‌లో నిర్వహించే మీ కోసం రద్దు

పోలీసు కార్యాలయంలో మీకోసం రద్దు

పదేళ్లుగా సాగుతున్న గుంటూరు – గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు పూర్తికావాల్సిన గాజులపల్లి–దిగువమెట్ట పనులు ఇంకా వినియోగంలోకి రాని నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఎప్పుడో..!

శంకరా..శుభంకరా
భక్తసులభుడైన భోళా శంకరుడు ఆద్యంత రహితమైన లింగరూపంలో ఉద్భవించిన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెం, మడనూరు తదితర ఆలయాల్లో వేలాది మంది భక్తులు శివయ్య దర్శనం కోసం బారులుతీరారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, శివకళ్యాణ మహోత్సవాలు, ఉపవాస నియమాలతో నిష్టగా స్వామిని అర్చించారు.
– సాక్షి నెట్‌వర్క్‌
ఈ లైను..

మహిళలను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వం

చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసింది. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.1500 లు ఇస్తాననని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో దానికి కేటాయింపులు లేవు. సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించి రెండేళ్లవుతున్నా వాటిని పూర్తి స్థాయిలో అందివ్వలేదు. కేవలం మాటలు చెప్పి ఊక దంపుడు ఆర్భాటాలు తప్ప ఈ బడ్జెట్‌లో పేదలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

– ఉడుముల అరుణ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి

బీసీలకు మొండిచేయి

కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపింది. ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు 50 ఏళ్లు దాటితే పింఛన్‌ ఇస్తాను అని చెప్పి ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతున్నా పింఛన్‌ హామీని తుంగలో తొక్కారు. చంద్రబాబు నాయుడు చెప్పేది కొండంత.. చేసేది మాత్రం శూన్యం. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్‌ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. అన్ని కలెక్టర్‌ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తాం.

– తాతా నరసింహా గౌడ్‌, వైఎస్సార్‌ సీపీ గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు

మార్కాపురం:

కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్‌ పనులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ఏళ్లతరబడి సాగుతూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల కిందట గుంటూరు–గుంతకల్‌ మధ్య డబ్లింగ్‌ పనులకు బడ్జెట్‌ మంజూరై పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించడంతో పదేళ్లుగా ఈ రైల్వే లైను మధ్య పనులు సాగుతూనే ఉన్నాయి. మొత్తం 401.47 కిలోమీటర్ల పొడవునా డబ్లింగ్‌ పనులు చేయాలి. అప్పట్లో రూ.3887.48 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. అప్పటి నుంచి దశలవారీగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న గాజులపల్లి, దిగువమెట్టల మధ్య దాదాపు 30 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులను చేయాల్సి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో రెండు సొరంగాల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. దాదాపు పదేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయి. పూర్తయితే పలు నూతన రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ్‌ కూడా పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరో వైపు నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో కనిగిరి వరకూ రైల్వేలైను పూర్తయినా ఇంకా ట్రయల్‌ దశలోనే ఉంది.

15 ఏళ్లుగా నడికుడి–శ్రీకాళహస్తి పనులు..

నడికుడి – శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైను పనులు 2011–12లో నాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు 2014 నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 45 కిలోమీటర్లు రైల్వేలైను, గుండ్లకమ్మ నుంచి–కనిగిరి వరకూ వయా దర్శి, పొదిలి మీదుగా 75 కిలోమీటర్ల రైలు మార్గాన్ని పూర్తిచేసి ఇటీవలే ట్రయల్‌ రన్‌ చేశారు. ఇంకా రైళ్ల రాకపోకలను ప్రారంభించలేదు.

ఆధునికీకరణ ఎప్పుడో..?

అమృత్‌ భారత్‌ పథకం కింద మార్కాపురం రోడ్‌ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. 2024 ఫిబ్రవరిలో వర్చువల్‌గా ప్రధాని, రైల్వే శాఖామంత్రి ప్రారంభించారు. రూ.21.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇంకా కంభం రైల్వేస్టేషన్‌కు రూ.11.72 కోట్లు, గిద్దలూరు రైల్వేస్టేషన్‌కు రూ.11.72 కోట్లను కేటాయించింది. మొదట్లో పనులు వేగంగా సాగినా ఆ తరువాత పర్యవేక్షణ కొరవడి పనులు నెమ్మదించాయి. ఈ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ సుమారు 3 నుంచి 4 వేల మంది ప్రయాణికులు, ఇటు గుంటూరు నుంచి గుంతకల్‌ వరకూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ మార్కాపురం రైల్వేస్టేషన్‌లో పనులు చాలా మిగిలి ఉన్నాయి. ప్లాట్‌ఫాంల విస్తరణ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, శ్రీశైలం యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు, గూడ్స్‌ షెడ్లు నిర్మించాల్సి ఉంది. దీంతోపాటు గిద్దలూరు, కంభం రైల్వేస్టేషన్లలో కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకతో పోటీ పడుతున్నాయి. 2014–19 మధ్య ఒంగోలు ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పటి కేంద్ర మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తేవడంతో రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు జరిగాయి. కంభం రైల్వేస్టేషన్‌ ద్వారా ప్రతిరోజూ సుమారు 2 వేల మంది, గిద్దలూరు రైల్వేస్టేషన్‌ ద్వారా రోజుకు సుమారు 3 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఇక ఈ మార్గం గుండా ప్రతిరోజూ దాదాపు 20 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానంగా హుబ్లీ, తిరుపతి, ప్రశాంతి, అమరావతి, ధర్మవరం, వాస్కోడిగామ, కాచీగూడ, నర్సాపూర్‌, బెంగుళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు సరుకు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు కూడా ప్రయాణిస్తుంటాయి. ఇలా ఆదాయం బాగా ఉన్నప్పటికీ వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. త్వరగా రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు, డబ్లింగ్‌ పనులు పూర్తిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

గిద్దలూరు– నంద్యాల మధ్య సొరంగ మార్గం

అధికారులకు వినతిపత్రం ఇచ్చాం..

ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ వాస్తవ మార్కాపురం రైల్వేస్టేషన్‌ సందర్శనకు వచ్చినప్పుడు రైల్వేస్టేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయనకు వివరిస్తూ వినతిపత్రం అందజేశాం. శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం డార్మిటరీ కట్టాలని, దొనకొండ రైల్వేస్టేషన్‌లో బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని, కంభం రైల్వేస్టేషన్‌లో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించాలని కోరాం. పిడుగురాళ్ల మీదుగా తిరుపతి, హైదరాబాద్‌ మధ్య రోజూ రాత్రిపూట ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టాలని కోరాం.

– ఓరుగంటి మల్లిక్‌, రైల్వే ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు, మార్కాపురం

ఒంగోలు సబర్బన్‌: కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం–పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీఆర్‌లో బీసీహెచ్‌ ఓబులేసు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అధికారులందరూ సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన బీచ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో విధులు నిర్వర్తించారన్నారు. దాంతో పాటు ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ కార్యాలయాలకు ఆప్షనల్‌ హాలిడే ను కలెక్టర్‌ పి.రాజా బాబు ప్రకటించారన్నారు. అందుకోసం మీ కోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు.

ఒంగోలు టౌన్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పోలీసు అధికారులందరూ డ్యూటీలో ఉండడం, మరికొందరు ఐచ్చిక సెలవుల్లో ఉండటంతో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఎస్పీ హర్షవర్థన్‌ రాజు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మీదుగా వెళ్లే గుంటూరు–గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తిచేయలేదు. అమృత్‌ భారత్‌ పథకం కింద చేపట్టిన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులూ అసంపూర్తిగా ఉండి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి.

జీవిత కాలం లేటు!1
1/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!2
2/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!3
3/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!4
4/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!5
5/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!6
6/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!7
7/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!8
8/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!9
9/10

జీవిత కాలం లేటు!

జీవిత కాలం లేటు!10
10/10

జీవిత కాలం లేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement