రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

Feb 15 2026 12:34 PM | Updated on Feb 15 2026 12:34 PM

రాష్ట

రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

పోటీల్లో తలపడుతున్న జట్లు

పోటీలను ప్రారంభిస్తున్న బసివిరెడ్డి

సింగరాయకొండ: మండలంలోని కనుమళ్ల పంచాయతీలోని ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో శనివారం ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ అస్మితా లీగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. రోల్‌ బాల్‌ ఇండియా రాష్ట్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కె.బసివిరెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వైజాగ్‌, ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌ గోదావరి, గుంటూరు, అనంతపురం, తాడిపత్రి, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పోటాపోటీగా జరిగే ఈ పోటీలు ఆదివారంతో ముగుస్తాయన్నారు. గెలిచిన క్రీడాకారులు సౌత్‌ జోన్‌ నేషనల్‌ రోల్‌బాల్‌ అస్మితా లీగ్‌ పోటీల్లో ఆడతారన్నారు. కార్యక్రమంలో మలినేని లక్ష్మయ్య, లక్ష్మి ఇంజినీరింగ్‌ కాలేజీ డైరెక్టర్‌ ఏజీకే మూర్తి, ప్రిన్సిపాల్‌ దిల్నషీన్‌, రోల్‌ బాల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ పోటీలు ప్రారంభం 1
1/1

రాష్ట్ర స్థాయి రోల్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement