ఉసురు తీసిన సరదా.. | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన సరదా..

Feb 15 2026 12:34 PM | Updated on Feb 15 2026 12:34 PM

ఉసురు తీసిన సరదా..

ఉసురు తీసిన సరదా..

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

కనిగిరి రూరల్‌: సరదాగా చేసిన ప్రయాణం ఓ పదో తరగతి విద్యార్థి ఉసురు తీసింది. శనివారం కనిగిరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన విద్యార్థులు వారి స్నేహితులతో కలిసి సరదాగా మూడు బైకులపై పట్టణ సమీపంలోని కలగట్ల వద్ద నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను చూసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కలగట్ల–కనిగిరి మధ్యలో మలుపు వద్ద ఓ బైక్‌ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని ఏబీఎం గ్రౌండ్‌కు చెందిన విజయ్‌ కుమారుడైన పదో తరగతి విద్యార్థి కుడుముల ప్రతాప్‌ (15), మరో విద్యార్థి బీ అనీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రతాప్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనీశ్‌కు చెయ్యి విరగడంతో చికిత్స చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement