చేతికందేంత ఎత్తులో విద్యుత్ లైన్లు
మార్కాపురం: ఆడుకుంటూ మిద్దైపెకి వెళ్లిన బాలుడికి చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలి తీవ్రగాయాలైన సంఘటన శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని 18వ వార్డులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మార్కాపురం 18వ వార్డులో నివాసం ఉండే ఎస్‌కే మాబున్ని కుమారుడు ఖాశీంవలి తోటి పిల్లలతో ఆడుకుంటూ మిద్దైపెకి వెళ్లాడు. ఆ మిద్దె మీదుగా విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. ఆడుకుంటున్న ఖాశింవలికి పొరపాటున విద్యుత్ లైన్లు తగలడంతో తల, మెడ, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఊహించని సంఘటనతో గట్టిగా కేకలు వేయడంతో అందరూ మిద్దెమీదకు వచ్చారు. ఖాశింవలి ఒంటిపై రక్తంకారుతూ విలవిల్లాడిపోవడం చూసి ఆశ్చర్యపోయి స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లారు.
విద్యుత్ షాక్‌తో బాలుడికి
తీవ్రగాయాలు
విద్యుత్ లైన్లు వెంటనే మార్చాలి :
పట్టణంలోని 18వ బ్లాకులో చేతికందేంత ఎత్తులో విద్యుత్ లైన్లు ఉన్నాయి. గతంలో కూడా ఇద్దరు పిల్లలకు ఇలానే కరెంటు షాక్ కొట్టింది. ఇప్పటికై నా విద్యుత్ శాఖాధికారులు స్పందించి చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను మార్చి పెద్ద విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. విద్యుత్ లైన్లు ఎవరికీ అందనంత ఎత్తులో బిగించాలి. ప్రతిరోజూ ఈ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్లు మార్చకపోతే మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
గఫూర్, 18వ బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మార్కాపురం
చేతికందేంత ఎత్తులో విద్యుత్ లైన్లు
చేతికందేంత ఎత్తులో విద్యుత్ లైన్లు


