భోగి మంటల్లో పీపీపీ ప్రతులు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దహనం చేసిన
వైఎస్సార్ సీపీ నాయకులు
మద్దిపాడులో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో దహనం
మద్దిపాడు:
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత ప్రతులను వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటల్లో దహనం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించి పేదలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దిపాడు మండలంలోని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఆయా ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వారి స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం దారుణన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసూ విధానాలు లేవన్నారు. పీపీపీ విధానంతో పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను చంద్రబాబు దూరం చేస్తున్నారని మేరుగు నాగార్జున విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, ఎన్‌జీ పాడు మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, నాయకులు కె.వెంకటేష్, ఎన్.మహేష్, పి.వెంకటరావు, పి.యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ మోసాలు,
అరాచకాలు భోగి మంటల్లో తగలబడాలి...
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, మోసాలు, వారి ఆలోచనలు భోగి మంటల్లో తగలబడాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం వేసిన భోగి మంటల్లో పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోను దహనం చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు తెచ్చిన పీపీపీ విధానం చీకటి జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశామని తెలిపారు. కూటమి పాలకులు ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఆ దేవుడు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, స్డూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు సిటీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కాకుటూరి సంపత్‌కుమార్, నాయకులు మలిశెట్టి దేవా, వైవీ గౌతమ్‌అశోక్, పిగిలి శ్రీనివాసరావు, పార్టీ కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, నాయకులు మట్టే రాఘవరావు, 15వ డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకులు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.
భోగి మంటల్లో పీపీపీ ప్రతులు


