కోడి పందేల బరుల తొలగింపు
కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధిలోని పత్తిపాటివారిపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన కోడి పందెం బరులను కందుకూరు రూరల్ పోలీసులు మంగళవారం తొలగించారు. ‘‘కోడి కత్తి దూస్తోంది... పందెం రాయుళ్లు రెడీ’’ అనే శీర్షికతో సాక్షిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. కోడి పందేలకు ఏర్పాటు చేసిన బరులను జేసీబీతో తొలగించి ఆ ప్రాంతాన్ని దున్నించారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించాలని నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ హెచ్చరించారు.
కోడి పందేల బరుల తొలగింపు


