వెలుగొండ ఫీడర్ కాలువ పనుల్లో ప్రమాదం
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని గంటవానిపల్లెలో జరుగుతున్న వెలుగొండ ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఇసుకలో కూరుకుని మృత్యువాతపడ్డాడు. వివరాల మేరకు.. గంటవానిపల్లె వద్ద ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల్లో కూలి పనులు చేస్తున్న తాళ్లూరి నాగరాజుపై లోడర్‌తో అనుకోని రీతిలో ఇసుకను డంప్ చేయటంతో నాగరాజు ఇసుకలో కూరుకుపోయి ఊపిరాడక మృత్యువాతపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్, ఎస్సై వెంకట రమణయ్య సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


