ఘనంగా వైఎస్సార్–బీఎస్సార్ సంక్రాంతి సంబరాలు
దర్శి: సంక్రాంతి పండగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్–బీఎస్సార్ సంక్రాంతి సంబరాలు మంగళవారం పండగ వాతావరణంలో జరిగాయి. వైఎస్సార్–బీఎస్సార్ క్రికెట్ పోటీలను యువకులు ఆసక్తిగా తిలకించారు. తొలుత క్రికెట్ ఆడి అభిమానులను బూచేపల్లి ఉత్సాహ పరిచారు. పొదిలి రోడ్డు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ముగ్గులు పోటీలు పోటాపోటీగా జరిగాయి. తిలకించేందుకు వందలాది మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోటీల్లో 195 మంది మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముగ్గులు పోటీలను తిలకించారు.
న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయులు మారం గీత, నాగలక్ష్మి, డాక్టర్ ఝాన్సీ వ్యవహరించారు. మొదటి బహుమతి కొల్లి సుజాతకు ఫ్రిజ్, ద్వితీయ బహుమతి ఎం.ప్రత్యూష, ఎల్‌ఈడీ టీవీ, తృతీయ బహుమతి పేరం మనోజ్ఞ వాషింగ్ మిషన్, నాలుగో బహుమతి బి.స్వాతి టేబుల్ గ్రైండర్, ఐదో బహుమతి పావని జానకి డ్రస్సింగ్ టేబుల్‌ను గెల్చుకున్నారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. విజేతలకు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా బహుమతలు అందజేశారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మలను స్థానికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్‌లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా ఉదయ్ భాస్కర్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్‌లు ఆవుల జ్యోతి శివారెడ్డి, పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబూరావు, జగన్నాథం మోహన్‌బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
క్రికెట్ విజేతలకు బహుమతులు
ప్రదానం చేసిన ఎమ్మెల్యే బూచేపల్లి
ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన


