క్వార్టర్ ఫైనల్స్‌కు చైన్నె జట్లు
మేదరమెట్ల: రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావినూతలలో జరుగుతున్న సంక్రాంతి కప్ అంతర్‌రాష్ట్ర క్రికెట్‌పోటీల్లో సౌత్‌జోన్‌సీసీ చైన్నె, ఎంఆర్‌సీసీ చైన్నె జట్లు విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం ఉదయం సౌత్‌జోన్‌సీసీ చైన్నె జట్టు ఏసీసీ లెవెన్ విజయవాడ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చైన్నె జట్టు 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు 16.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో సౌత్‌జోన్ సీసీ చైన్నె జట్టు క్వార్టర్‌ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్‌లో జీడీసీఏ లెవెన్–ఎంఆర్‌సీసీ చైన్నె జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన జీడీసీఏ లెవెన్ జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 152 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఎంఆర్‌సీసీ చైన్నె జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 4వికెట్ల తేడాతో చైన్నె జట్టు విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
నేటి మ్యాచ్‌లు: ఉదయం శ్రీసీసీ చైన్నె ఎస్‌ఎస్‌ఎస్‌సీ హైదరాబాద్ జట్ల మధ్య, మధ్యాహ్నం ఏడీసీఏ లెవెన్ అనంతపురం–ఎస్‌కేఎం సీసీ చైన్నె జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.


