లారీని ఢీకొని ఒకరు మృతి
రాచర్ల: లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని యడవల్లి క్రాస్ రోడ్డు వద్ద అమరావతి–నంద్యాల జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు పట్టణానికి చెందిన పరిశపోగు అభిషేక్(30) , డ్రైవర్ ఇల్లూరి నరేంద్ర ఇద్దరు కలిసి గిద్దలూరు నుంచి కంభానికి కారులో బయలుదేరారు. అదే సమయంలో నంద్యాల నుంచి నరసరావుపేటకు మొక్కజొన్న లోడుతో ముందు వెళుతున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు లారీ వెనుకభాగంతో బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిశపోగు అభిషేక్ (30)అనే యువకుడు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై. పి.కోటేశ్వరరావు తెలిపారు.


