పోర్టు పనులను పరిశీలించి ఏపీఎంబీ సీఈఓ
కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ఏపీ మారిటైంబోర్డు సీఈఓ అభిషేక్‌శర్మ, ఎస్‌డీఓ రాజశేఖర్ ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం పోర్టు నిర్మాణంలో జరుగుతున్న పనులు, ఎంతమేర పూర్తి చేశారు, ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ ఉన్నాయనే అంశాలను పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం ఈ ప్రాంత అభివృద్ధికి కీలకం కానున్న నేపథ్యంలో త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిశోర్ తదితరులు ఉన్నారు.


