ఎడ్ల పోటీలతో రైతుల్లో ఆనందం
తెలుగుదనం ఉట్టిపడేలా వైఎస్సార్ సీపీ కార్యక్రమాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
యర్రగొండపాలెం: తెలుగుదనం ఉట్టిపడేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతోందని, జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చేలా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటుచేసి రైతుల మోములో ఆనందం తీసుకొచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ఆదివారం ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. అధికారం లేనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలను ఉత్తేజపరచడం హర్షించదగిన విషయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి, ఆవకాయ అంటూ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని, అక్కడ ఆవకాయ మాత్రమే మిగులుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడి బతికే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యవసాయాన్ని దండగ చేసిన చంద్రబాబు కూటమికి వ్యతిరేకంగా వ్యవసాయం అంటే పండుగ అని, మన సంస్కృతికి అద్దంపట్టే ఎద్దుల పోటీలకు ఆశేషంగా ప్రజలు తరలిరావడం శుభపరిణామమని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతులకు పండగని, నష్టం వచ్చినా వ్యవసాయం చేయాల్సిందేనని, ఎందుకంటే వ్యవసాయమే రైతు జీవనమన్నారు. వ్యాపారమని, ఉద్యోగమని, ఒక వేళ రైతులు వ్యవసాయం చేయకుంటే ప్రజలంతా పస్తులు పండుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్‌అలీబేగ్, మార్కాపురం మునిసిపల్ చైర్మన్ చిర్లంచెర్ల మురళీకృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ ఐవీ.సుబ్బారావు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి సుబ్బమ్మ, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, వాగ్యా నాయక్, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పీ కృష్ణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, ఎం.రాజశేఖర్, పి.రాములు నాయక్ పాల్గొన్నారు.


