గురుదేవోభవ..
రథంపై ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆయన ఏ రాజకీయ నాయకుడో, ప్రజాప్రతినిధో కాదు.. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయునిగా తమకు చదువు చెప్పి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న 93 ఏళ్ల కొప్పోలు హనుమంతరావును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు రథంపై ఉంచి ర్యాలీగా ఊరేగించారు. పూర్వవిద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆయన్ను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
– సాక్షి, ఒంగోలు


