కారు ఢీకొని వ్యక్తి మృతి
బేస్తవారిపేట: కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం రాత్రి బేస్తవారిపేట జంక్షన్‌లోని ప్లైఓవర్‌పై జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే..నంద్యాల జిల్లా గాజులపల్లెకు చెందిన షేక్ అప్పునపల్లి అల్లాబకాష్(35), గిద్దలూరుకు చెందిన పీరయ్య, షేక్ ఖాశీంపీరాలు కంభంలోని ఓ గృహంలో టైల్స్, మార్బుల్స్ బిగించారు. ముగ్గురు మోటార్‌సైకిల్‌పై గిద్దలూరు వెళ్తున్న సమయంలో బేస్తవారిపేట జంక్షన్ ప్లైఓవర్‌పై ఎదురుగా కంభం వైపు వెళ్తున్న కారు బస్‌ను ఓవర్ క్రాస్ సమయంలో ఢీకొట్టింది. మోటార్‌సైకిల్ నడుపుతున్న అల్లాబకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పీరయ్య, ఖాశీంపీరాలను హైవేరోడ్డు అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోటార్‌సైకిల్ నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బేస్తవారిపేట ప్లైఓవర్‌పై ఘటన
కారు ఢీకొని వ్యక్తి మృతి


